16 April, 2026 | 12:05 PM

Breaking News

కామ్రేడ్ పెద్దబ్బాయికు నివాళులర్పించిన పోతినేని సుదర్శన్   •   కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం: ఎనిమిది మంది భక్తులు మృతి   •   మాజీ సర్పంచ్ ను పరామర్శించిన మంత్రి పొంగులేటి   •   స్టేట్ 2వ ర్యాంక్ సాధించిన విద్యార్థినికి ఘన సత్కారం   •   ప్రముఖ గాయని ఆశా భోస్లే మృతి పట్ల లోక్‌సభ సంతాపం   •   డీలిమిటేషన్ పై దేశవ్యాప్తంగా ఉత్కంఠ   •   వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్   •   అదృశ్యమైన వ్యక్తి దారుణ హత్య.. పొలాల్లో లభ్యమైన బూడిద, అస్తికలు   •   ఆక్రమణలు తొలగించి అభివృద్ధికి సహకరించండి.   •   జై కిసాన్ రైతు సంక్షేమ సంఘం అధ్యక్షులుగా కొత్త మహేష్   •  

ప్రశాంత వాతావరణంలో బక్రీద్ పండుగను జరుపుకోవాలి

31-05-2025 08:34 PM

డీఎస్పీ ప్రభాకర్

పటాన్ చెరు: బక్రీద్ పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని పటాన్ చెరు  డీఎస్పీ ప్రభాకర్ సూచించారు. శనివారం పటాన్ చెరు, జిన్నారం, ఐడీఏ బొల్లారం పోలీస్ స్టేషన్ల లో శాంతి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. పటాన్ చెరు, జిన్నారం పోలీస్ స్టేషన్ లలో నిర్వహించిన పీస్ కమిటీ సమావేశాలకు డీఎస్పీ ప్రభాకర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డీఎస్పీ ప్రభాకర్ మాట్లాడుతూ.. పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని తెలిపారు.

మెడికల్ సర్టిఫికెట్ ఉన్న పశువులను మాత్రమే ఈ సందర్భంగా తరలించాలని ఆయన సూచించారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా వ్యవహరించాలని తెలిపారు. ఈ సమావేశాలలో పటాన్ చెరు  సీఐ వినాయక రెడ్డి, జిన్నారం సీఐ నయీముద్దీన్, ఐడీఏ బొల్లారం సీఐ రవీందర్ రెడ్డి, ఎస్సైలు నాగలక్ష్మి, కోటేశ్వరరావు, సుధాకర్ వివిధ రాజకీయ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.