27 May, 2026 | 12:48 PM

Breaking News

హైదరాబాద్ రోడ్లపైకి 60 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు.. ప్రారంభించిన మంత్రి పొన్నం   •   రైతులకు దుర్భర పరిస్థితులు కల్పించిన కాంగ్రెస్ ప్రభుత్వం.. మట్టికొట్టుకుపోతుంది!   •   ప్రకృతి ప్రకోపం... కుటుంబం గాయాలపాలు... ఆదుకోవాలని వేడుకోలు   •   15 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన   •   వడదెబ్బతో వ్యక్తి మృతి   •   బాధిత కుటుంబానికి పరామర్శ   •   కుటుంబాన్ని మింగేసిన అప్పుల ఊబి... వనపర్తి జిల్లాలో త్రీవవిషాదం   •   ఉపాధి పనులు పారదర్శకంగా జరగాలి   •   అర్ధరాత్రి వర్షం.. తడిసిన ధాన్యం.. రైతన్న ఆగమాగం   •   గాలివానతో గుడిసె పైకప్పు చిన్నాభిన్నం.. రోడ్డున పడిన పేదకుటుంబం   •  

పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన డీఎస్పీ వెంకటరెడ్డి

08-11-2024 03:14 PM

వెల్దుర్తి (విజయక్రాంతి): మెదక్ జిల్లా వెల్దుర్తి పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన తూప్రాన్ డీఎస్పీ వెంకటరెడ్డి, సిఐ రంగా కృష్ణ, అనంతరం స్టేషన్ లో ఉన్న పలు రికార్డులను, ఇప్పటి వరకు నమోదైన ఎఫ్ ఐ ఆర్ లను, స్టేషన్ పరిసర ప్రాంతాలను సందర్శించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మండలం ఉన్న ప్రతి గ్రామంలో సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, సీసీ కెమెరాలు ద్వారా దొంగతనాలు కానీ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా సీసీ కెమెరాలు ఉపయోగపడతాయని ఆయన తెలిపారు. కొన్ని గ్రామాల్లో పనిచేయని సీసీ కెమెరాలను రిపేరు చేయించుకోవాలని ఆయన సూచించారు. ఈ మధ్యన మండలం జరిగిన దొంగతనాల త్వరలోనే చేదించి దొంగలను తొందర్లోనే పట్టుకుంటామని మీడియాతో చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో సి ఐ రంగా కృష్ణ, ఎస్ఐ తదితరులు పాల్గొన్నారు.