28 June, 2026 | 2:00 PM

Breaking News

రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి   •   సీఐ, ఎస్సై సస్పెన్షన్   •   ల్యాండ్ పూలింగ్‌పై రైతులకు, భూ యజమానులకు తహసిల్దార్ చంద్రశేఖర్ విజ్ఞప్తి   •  

77మంది డీఎస్పీలు బదిలీ

20-05-2025 02:54 AM
  1. తక్షణమే ఉత్తర్వులు అమల్లోకి.. 
  2. డీజీపీ జితేందర్ ఉత్తర్వులు జారీ  

హైదరాబాద్, మే 19 (విజయక్రాంతి): తెలంగాణ పోలీసు శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 77 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ జితేందర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. తక్షణమే ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని తెలిపారు. బాలానగర్ ఏసీపీగా నరేశ్‌రెడ్డి, శంషాబాద్ ఏసీపీగా శ్రీకాంత్‌రెడ్డి, మాదాపూర్ ఏసీపీగా సీహెచ్ శ్రీధర్, చిక్కడపల్లి ఏసీపీగా శ్రీకాంత్, మేడ్చల్ ఏసీపీగా శంకర్‌రెడ్డి, సంతోష్‌నగర్ ఏసీపీగా సుఖ్‌దేవ్‌సింగ్, హుజూరాబాద్ డీఎస్పీగా మాధవి, కామారెడ్డి డీఎస్పీగా శ్రీనివాసరావు, పటాన్‌చెరు ఏసీపీగా ప్రభాకర్, సిద్దిపేట ఏసీపీగా రవీందర్‌రెడ్డి, కూకట్ పల్లి ఏసీపీగా రవికిరణ్‌రెడ్డి, పేట్‌బషీర్‌బాద్ ఏసీపీగా బాలగంగిరెడ్డి, మహే శ్వరం ఏసీపీగా జానకిరెడ్డి, షాద్‌నగర్ ఏసీపీగా లక్ష్మినారాయణ సహా 77 మందిని డీజీపీ బదిలీ చేశారు.