20-05-2025 02:51:57 AM
హైదరాబాద్, మే 19 (విజయక్రాంతి): సమ్మె కాలానికి అధ్యాపకు లకు వేతనం చెల్లించాలని వర్సిటీ వీసీలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయ డంపై కాంట్రాక్టు అధ్యాపక సంఘాలు హర్షం వ్యక్తంచేశాయి. ఈమేరకు సో మవారం ఒక ప్రకటన విడుదల చేశా యి. సీఎం, ఉన్నతవిద్యామండలి చైర్మన్‌కు కాంట్రాక్టు అధ్యాపకుల సంఘా లు కృతజ్ఞతలు తెలిపాయి. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ రాష్ర్టవ్యాప్తంగా ఉన్న వర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులు గతంలో సమ్మె చేపట్టిన విషయం తెలిసిందే.
ఈనేపథ్యంలో వర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకుల సమ్మె కాలానికిగాను కోత విధించిన 11 రోజులు వేతనాల ను తిరిగి వెంటనే చెల్లించాలని ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి రాష్ర్టంలోని 12యూనివర్సిటీల వైస్ చాన్స్‌లర్లకు ఆదేశాలు జారీచేశారని కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం నాయకులు డాక్టర్ పరశురామ్, డాక్టర్ ధర్మతేజ తెలిపారు. అలాగే కొత్తగా పదవీ బాధ్యతలు స్వీకరించిన ప్రభు త్వ సీఎస్ రామకృష్టారావును మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు చెప్పారు. కాంట్రాక్టు అధ్యాపకుల పెం డింగ్ సమస్యలను పరిష్కరించాలని వారు సీఎస్‌ను కోరారు.