calender_icon.png 20 May, 2025 | 8:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తే చెరగవు

20-05-2025 02:57:34 AM

  1. ఇప్పటికైనా రేవంత్‌కు జ్ఞానోదయం కావాలి
  2. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి

హైదరాబాద్, మే 19 (విజయక్రాంతి): కేసీఆర్ కట్టిన అద్భుతమైన కట్టడాలు సెక్రటేరియట్, పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్, యాదాద్రి దేవాలయాన్ని చూసి ప్రపంచ సుందరీమణులు సంబరంతో ఆశ్చర్యపో యారని, సెల్ఫీలు తీసుకున్నారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. అమరుల స్మారక జ్యోతి, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం, టీ హబ్‌లను కూడా ప్రపంచ సుందరీమణులకు చూపించండి అంటూ సోమవారం విడుదల చేసిన ప్రకటనలో ప్రభుత్వానికి సూచించారు.

కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేయడం ఎవరితరం కాదని పేర్కొన్నారు. దిగజారుడు విమర్శలు మాని ఇకనైనా ప్రజలకు ఇచ్చిన హామీలు, పాలనపై సీఎం రేవంత్‌రెడ్డి దృష్టి సారించాలని ప్రశాంత్‌రెడ్డి హితవు పలికారు. ప్రజలు సమస్యల్లో ఉంటే సీఎం మాత్రం మిస్ వరల్డ్ పోటీల నిర్వహణలో మునిగి తేలుతున్నారని మండిపడ్డారు. రాష్ర్టం దివాళా తీసింది, ఎకక్కడా అప్పు పుట్ట టం లేదన్న సీఎం.. అందాల పోటీల పేరుతో వందల కోట్ల దుబారా ఖర్చు ఎందుకు చేస్తున్నారని ప్రశాంత్‌రెడ్డి ప్రశ్నించారు.

కేసీఆర్ చేసిన అభివృద్ధే దిక్కయింది: ఎర్రోళ్ల శ్రీనివాస్

కేసీఆర్ ఆనవాళ్లు తుడిచేస్తా అన్న రేవంత్‌రెడ్డికి నేడు కేసీఆర్ చేసిన అభివృద్ధే దిక్కయిందని బీఆర్‌ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ అన్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్, సెక్రటేరియట్, టీ హబ్‌లకు ప్రపంచ సుందరీమణులను తీసుకువచ్చారని ఆ కట్టడాలు కేసీఆర్ కట్టించినవే అని సోమవారం విడుదల చేసిన ప్రకటనలో అన్నారు. చరిత్రను ఎవరూ కనమరుగు చేయలేరని, తెలంగాణపై ఉన్న కేసీఆర్ ఆనవాళ్లను కూడా సీఎం రేవంత్‌రెడ్డి చెరిపెయ్యలేరన్నారు.