కొమరవెల్లి మల్లన్న పట్నాల వేడుకలో దుద్దిళ్ల శ్రీనుబాబు
08-12-2024 08:53 PM
మంథని (విజయక్రాంతి): రామగిరి మండలం పన్నూరు గ్రామంలో ఆదివారం మల్లన్న దేవుని పట్నాలలో కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు దుద్దిళ్ల శ్రీను బాబు పాల్గొన్నారు. రామగిరి మండలం కేంద్రములో మంథని బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తొట్ల తిరుపతి యాదవ్ స్వగృహంలో మల్లన్న పట్నాలో పాల్గొని శ్రీనుబాబు కాసేపు ఒగ్గు పూజారులతో కలిసి పట్నం వేశారు. తిరుపతి యాదవ్ దంపతులు శ్రీనుబాబును ఘనంగా సన్మానించారు. అనంతరం పన్నూర్ లో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు గాజుల భూమయ్య గౌడ్ స్వగృహంలో కూడా పట్నాలలో పాల్గొన్నారు. మల్లన్న స్వామి ఆశీర్వాదంతో అందరూ సుభిక్షంగా ఉండాలని శ్రీనుబాబు కోరారు. శ్రీనుబాబు వెంట మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పెండ్రు రమాదేవి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






