19 April, 2026 | 6:33 AM

గురుకులాల్లో నాణ్యమైన వసతులు కల్పించాలి

08-12-2024 09:21 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలోని సంక్షేమ గురుకులాల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అన్ని రకాల వసతులు కల్పించాలని టిఆర్ఎస్వి నాయకులు మహేష్ అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేద ప్రజల కోసం గురుకులాలు ఏర్పాటు చేస్తే ఆ గురుకులాల్లో చదువుతున్న పిల్లలకు మంచి ఆహారం సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఆరోపించారు. గురుకులాల సందర్శనకు వెళ్తున్న టిఆర్ఎస్ పార్టీ నాయకులను అడ్డుకొని అరెస్ట్ చేయడం సరికాదని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.