ఉద్యోగ భద్రత కల్పించాలి
08-12-2024 08:41 PM
నిర్మల్ (విజయక్రాంతి): విద్యాశాఖలో సర్వ శిక్ష అభియాన్ కింద పనిచేస్తున్న ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని వారు చేస్తున్న సమ్మె ఆదివారం నాటికి మూడో రోజుకు చేరుకుంది. ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని ఆ సంఘం నాయకులు పిలుపునిచ్చారు. ఏళ్ల తరబడి పనిచేస్తున్న తమ సేవలను గుర్తించి తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని వారు కోరారు.






