ప్రతి వ్యక్తికి హక్కులు కలిగి ఉంటాయి
నాగిరెడ్డిపేట, మార్చి 2 (విజయ క్రాంతి): మండలంలోని చిన్న ఆత్మకూరు గ్రామంలో స్థానిక ఎస్త్స్ర భార్గవ్ గౌడ్ ఆధ్వర్యంలో సివిల్ రైట్స్ డే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్త్స్ర భార్గవ్ గౌడ్ మాట్లాడుతూ.. భారత రాజ్యంగం ద్వారా ప్రజలకు కల్పించబడిన ప్రాథమిక హక్కుల గురించి గ్రామస్తులకు అవగాహన కల్పించారు. సమానత్వపు హక్కు,స్వేచ్ఛగా జీవించే హక్కు, దోపిడిని వ్యతిరేకించే హక్కు,మత స్వేచ్ఛ హక్కు,విద్య మరియు సాంస్కృతిక హక్కులపై గ్రామస్తులకు ఎస్‌ఐ.భార్గవ్ గౌడ్ వివరించారు.
అనంతరం మాజీ జెడ్పిటిసి ఉమ్మన్నగారి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి వ్యక్తికి సమాజంలో గౌరవంగా జీవించే హక్కు కలిగి ఉంటుందని ప్రతి వ్యక్తి గౌరవంగా జీవించాలనన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అనిత లచ్చయ్య, ఏఈఓ దివ్య, ఎస్సీ, ఎస్టీ హాస్టల్ వార్డెన్ రాములు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.






