18 August, 2026 | 8:13 PM

Breaking News

సామాజిక న్యాయం కోసం పోరాడిన గొప్ప సంఘ సంస్కర్త సర్వాయి పాపన్న గౌడ్   •   సర్వాయి పాపన్న గౌడ్ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం   •   ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే ఫోకస్‌.. అధికారులకు క్లాస్‌   •   పాలిటెక్నిక్ విద్యార్థుల ర్యాలీ.. రాస్తారోకో   •   చెన్నూర్ లో ఘనంగా పాపన్న గౌడ్ జయంతి వేడుకలు   •   పశు పోషణ యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన కార్యక్రమం   •   సేంద్రియ వ్యవసాయంతో లాభాలు   •   ఈనెల 19న జిల్లాకు ఎస్టీ, ఎస్సీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకయ్య   •   ఘనంగా సర్వాయి పాపన్న జయంతి వేడుకలు   •   అర్జున అవార్డులకు ఎంపికైన తెలంగాణ క్రీడాకారులకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు   •  

చెన్నూర్ లో ఘనంగా పాపన్న గౌడ్ జయంతి వేడుకలు

18-08-2026 07:36 PM

చెన్నూర్,(విజయక్రాంతి): మొఘల్ రాజుల దురంహకారంపై దిక్కార స్వరమై సబ్బండ వర్గాలను ఏకం చేసి రాజ్యాధికారం చేపట్టిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను మంచిర్యాల జిల్లా చెన్నూరులో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గౌడ సంఘం సభ్యులు మాట్లాడుతూ... మొఘలుల ఆధిపత్యానికి, జాగీర్దార్ల పన్నుల దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా శ్రమజీవులందరినీ ఏకం చేసి బహుజన రాజ్యాధికారాన్ని ఏర్పాటు చేసిన ధీరుడు  పాపన్న గౌడ్‌ కొనియాడారు.

పాపన్న గౌడ్ ఆశయాలను నేటి తరానికి తెలియజేయాల్సిన అవసరం ఉందని వారన్నారు. సమాజంలోని అన్ని వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన పోరాట స్ఫూర్తిని కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు నగునూరి   వెంకటేశ్వర్ గౌడ్, కోటపల్లి మండల మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు పబ్బ రాజ గౌడ్, గౌడ సంఘం నాయకులు, గీత కార్మికులు, గౌడ యువకులు తదితరులు పాల్గొన్నారు.