ఘనంగా సర్వాయి పాపన్న జయంతి వేడుకలు
18-08-2026 07:21 PM
మెట్ పల్లి,(విజయక్రాంతి): మెట్ పల్లి పట్టణంలో మంగళవారం సర్వాయి పాపన్న జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆయన విగ్రహానికి టీపీసీసీ నేత జువ్వాడి కృష్ణారావు, మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రిలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సమాజంలో అణగారిన వర్గాల హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం సర్వాయి పాపన్న చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఓంకార్ నవీన్,కమిషనర్ శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ కౌన్సిలర్ లు,స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, గౌడ కులస్తులు, మున్సిపల్ అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.






