18 August, 2026 | 8:02 PM

Breaking News

సామాజిక న్యాయం కోసం పోరాడిన గొప్ప సంఘ సంస్కర్త సర్వాయి పాపన్న గౌడ్   •   సర్వాయి పాపన్న గౌడ్ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం   •   ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే ఫోకస్‌.. అధికారులకు క్లాస్‌   •   పాలిటెక్నిక్ విద్యార్థుల ర్యాలీ.. రాస్తారోకో   •   చెన్నూర్ లో ఘనంగా పాపన్న గౌడ్ జయంతి వేడుకలు   •   పశు పోషణ యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన కార్యక్రమం   •   సేంద్రియ వ్యవసాయంతో లాభాలు   •   ఈనెల 19న జిల్లాకు ఎస్టీ, ఎస్సీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకయ్య   •   ఘనంగా సర్వాయి పాపన్న జయంతి వేడుకలు   •   అర్జున అవార్డులకు ఎంపికైన తెలంగాణ క్రీడాకారులకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు   •  

సేంద్రియ వ్యవసాయంతో లాభాలు

18-08-2026 07:30 PM

భీమిని,(విజయక్రాంతి): సేంద్రియ వ్యవసాయంతో అధిక లాభాలు వస్తాయని భీమిని మండల వ్యవసాయాధికారి రజిత అన్నారు. మండలంలోని కర్జీ బీంపూర్ గ్రామంలో ఆత్మ ఆధ్వర్యంలో సేంద్రియ వ్యవసాయంపై మంగళవారం రైతులతో ఏర్పాటు చేసిన   సమావేశంలో ఏవో రజిత మాట్లాడుతూ... సేంద్రియ వ్యవసాయం గోమాత ఆధారంగా చేయడం ద్వారా బూసారం పెరిగి రసాయన ఎరువులు వాడకుండా ఖర్చులు తగ్గించుకోవడంతో రైతులు అధిక లాభం పొందచ్చని అన్నారు.

సేంద్రియ  వ్యవసాయంలో జీవామృతం, ఆవు పేడ, గోమూత్రం, ఘనజీవామృతం, ఉపయోగించడం వలన భూసారం పెరిగి పంట దిగుబడి పొందవచ్చునన్నారు. ఇందులో  భాగంగా జీవామృతం తయారు చేసే విధానం గురించి  రైతులకు  వివరించారు.  సేంద్రియ వ్యవసాయంతో  చేసిన ఆ పంటలు ఆహారంగా తినడం వల్ల ఆరోగ్యం చేకూరుతుందని అన్నారు. గ్రామంలోని పెసర వేసిన రైతు పొలం సందర్శించారు. ఈ సందర్భంగా రైతులకి సేంద్రియ వ్యవసాయం వైపు మరలాల్సిందిగా  కోరారు. అలాగే పంట మార్పిడి చేయవలసిందిగా రైతులకి తెలియజేశారు .ఈ కార్యక్రమంలో కర్జి బీంపూర్ సర్పంచ్ చంద్రకళ దేవి, Aeo శ్రీనివాస్ రైతులు పాల్గొన్నారు.