calender_icon.png 6 December, 2024 | 5:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వీణా శారదాలంకరణలో హంస వాహనంపై దుర్గాభవానీ అమ్మవారు

09-10-2024 06:57:00 PM

కరీంనగర్ (విజయక్రాంతి): కరీంనగర్‌ మండలం నగునూర్‌లోని శ్రీ దుర్గాభవానీ ఆలయంలో దుర్గాభవానీ నవరాత్రులు వైభవంగా ప్రారంభమైనాయి. ఏడవ రోజు బుధవారం మూల నక్షత్రం కావడంతో అమ్మవారు సరస్వతీగా భక్తులకు దర్శనమిచ్చారు. ఇంద్రాణి అలంకరణలో ఐరావత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు, ఆలయ ధర్మాధికారి పురాణం మహేశ్వర శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక హారతులిచ్చి పూజలు నిర్వహించారు. ఆమ్మవారి దీక్షదారులకు, భక్తులకు అన్నప్రసాధ వితరణ చేసారు, మహిళలు అమ్మవారిని దర్శించుకుని చీరేసారే పెట్టి ఓడిబియ్యం పోసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ పూజల్లో ఆలయ ఫౌండర్‌ చైర్మెన్‌ వంగల లక్ష్మన్, ఆలయ కమిటి బాధ్యులు, భక్తులు పాల్గోన్నారు.