12 March, 2026 | 7:11 PM

Breaking News

రేమిడిచర్ల గ్రామంలో ప్రజల పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం   •   పశువులకు గాలి కుంట వ్యాధి నివారణ టీకాలు   •   మెడిపల్లి జడ్పీహెచ్ఎస్ లో ఘనంగా ఎస్సెస్సీ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం   •   దాసోహం బ్రదర్స్ ను పరామర్శించిన స్వర్ణకార సంఘం నాయకులు   •   టియుసిఐ రాష్ట్ర రాజకీయాల శిక్షణ తరగతులను జయప్రదం చేయండి   •   పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   డ్రగ్స్‌పై దండయాత్ర.. మార్గదర్శి స్కూల్ విద్యార్థుల అవగాహన ర్యాలీ   •   వాటర్ ప్లాంట్ లో నూతన మిషనరీ ఏర్పాటు   •   ప్రపంచం ఇలాంటి చమురు సంక్షోభం ఎన్నడూ చూడలే   •  

జిల్లెళ్ళ, కట్కూర్ గ్రామాల్లో నూతన భవనాలకు భూమిపూజ

12-03-2026 05:08 PM

తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలోని జిల్లెళ్ళ గ్రామంలో 12 లక్షల రూపాయలతో నూతన అంగన్వాడి భవనం, 10 లక్షల రూపాయలతో లక్ష్మీ మహిళా సమాఖ్య సంఘం భవనం నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. అలాగే కస్బీ కట్కూర్ గ్రామంలో సమన్వయ, భగవతి మహిళా వీవో మహిళా సమాఖ్య భవనాలకు 10 లక్షల రూపాయల చొప్పున మంజూరు కావడంతో ఆ భవనాల నిర్మాణానికి కూడా భూమిపూజ చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు నాగుల సత్యనారాయణ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్  స్వరూప తిరుపతి రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రవీణ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్  నర్సింగ్ గౌడ్, జిల్లెళ్ళ సర్పంచ్ దుబ్బాక రజిత రమేష్, కట్కూర్ సర్పంచ్ బొడ్డు స్వాతి, డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, నాయకులు పబ్బతి కృష్ణారెడ్డి, మునిగల రాజు, రాజేశ్వర్ రావు, నరేందర్, శ్రీనివాస్, ఆయా గ్రామాల ఉపసర్పంచ్‌లు, వార్డు సభ్యులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, గ్రామ శాఖ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. భవనాల నిర్మాణం చేపట్టడం పట్ల మహిళా సంఘాల సభ్యులు నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.