3 May, 2026 | 11:00 PM

108 అంబులెన్స్ లో ఆడబిడ్డకు జననం

12-03-2026 05:09 PM

ఉట్నూర్, మార్చి 12 (విజయక్రాంతి) : ఇంద్రవెల్లి మండలం గట్టేపల్లి పంచాయతీ పరిధిలోని చిత్త గూడ కు చెందిన  సావిత్ర బాయి అనే గర్భిణీ 108 అంబులెన్స్ లో డెలివరీ అయింది. 108 అంబులెన్స్ పైలట్ రాజేష్, ఈఎంటి సంతోష్ తెలిపిన వివరాల ప్రకారం.. చిత్త గూడ కు చెందిన  సావిత్రిబాయి గురువారం పురిటి నొప్పులతో    బాధపడుతున్నట్లు సమాచారం వచ్చిందన్నారు. చిత్తాగూడ నుంచి అంబులెన్స్ లో ఇంద్రవెల్లి పి.హెచ్.సి కి  తీసుకువచ్చిన తర్వాత సావిత్రి బాయి కి  రక్తహీనత ఉందని, రక్తం ఎక్కించవలసి ఉంటుందని వైద్యుల సూచనతో వెంటనే రిమ్స్ కు తీసుకు వెళ్తుండగా, పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో ముత్తునూరు గ్రామ శివారులో అంబులెన్స్ లోనే ప్రసవించిందన్నారు. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని తెలిపారు.