వ్యాపారులకు చెత్త నిర్వహణ, ట్రేడ్ లైసెన్స్‌పై అవగాహన
12-03-2026 05:04 PM
తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం రామచంద్రాపూర్ గ్రామంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారం తంగళ్లపల్లి మండలం రామచంద్రపూర్ గ్రామంలో ఫంక్షన్ హాల్ యజమానులు, దుకాణదారులు మరియు ఫ్లవర్ డెకరేషన్ షాప్ యజమానులకు చెత్త నిర్వహణ, ప్లాస్టిక్ వినియోగ నియంత్రణ మరియు ట్రేడ్ లైసెన్స్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో పరిశుభ్రతను కాపాడుతూ వ్యాపారాలు నిర్వహించాలని, ప్రభుత్వ నిబంధనలను పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పొన్నాల నర్సింహులు, గ్రామ పంచాయతీ కార్యదర్శి లక్ష్మి, వ్యాపారస్తులు గంధం మధు, వేగ్గలం శారదా, మహేందర్ రెడ్డి, వడ్ల శేఖర్, బొడ్డు దినేష్, రేషం మహేందర్, బొడ్డు శ్రీధర్, పొన్నాల పోచయ్య తదితరులు పాల్గొన్నారు.




