కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయ క్రాంతి): పద్మశాలీలు అన్ని రంగాల్లో రాణించాలి అదిలాబాద్ ఎంపీ గోడం నాగేష్ అన్నారు. కాగజ్ నగర్ పట్టణంలోని పద్మశాలి భవన్ లో సోమవారం పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన దసరా అలయ్ బలయ్ కార్యక్రమానికి అదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గోడం నాగేష్ సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు, బి ఆర్ ఎస్ పార్టీ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో కలిసి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ చేనేత చేతివృత్తులను అందరూ కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని తెలియజేశారు. పాల్వాయి హరీష్ బాబు గారు మాట్లాడుతూ పట్టణంలోని ఆదర్శ్ నగర్లో పద్మశాలి సంఘ భవనం దాదాపుగా పూర్తి కావచ్చిందని తెలిపారు. చేనేత కళాకారులను మనం ఆదరించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదన్నారు.
ఎల్లవేళలా అండదండగా ఉంటూ వారి అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.అనంతరం ఇటీవల వెలువడిన డిఎస్సీ ఉపాధ్యాయ ఫలితాలలో ఉద్యోగం సాధించిన 16 మంది పద్మశాలి బిడ్డలను ఎంపీ , ఎమ్మెల్యే శాలువలతో సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో భారత రాష్ట్ర సమితి నాయకులు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్, పద్మశాలి సంఘం అధ్యక్షులు కుడిక్యాల రాజమౌళి, ప్రధాన కార్యదర్శి వనమాల కేదారి, పద్మశాలి సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు సామల రాజన్న, భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొంగ సత్యనారాయణ, భాజపా పట్టణ అధ్యక్షులు సిందం శ్రీనివాస్, పద్మశాలి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్ల కనకయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శిగడదాసు మల్లయ్య, మరియు పద్మశాలి సంఘం నాయకులు, మహిళలు పాల్గొన్నారు.
పార్టీ బలోపేతానికి కృషి చేయాలి: ఎంపీ
బిజెపి పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్క కార్యకర్త కంకణ బద్ధులై కృషి చేయాలని అదిలాబాద్ ఎంపీ నగేష్ ఆన్నారు. సోమవారం మండలంలోని ఇస్గాం, బెజ్జూర్ మండలంలో బిజెపి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఎమ్మెల్యే హరీష్ బాబుతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలోనే బిజెపి సభ్యత్వ తమ స్థానంలో ఉండేలా ప్రతి కార్యకర్త సభ్యత్వ నమోదును వేగవంతం చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు పాల్గొన్నారు.