వెల్దుర్తి,(విజయక్రాంతి): తన సొంత వ్యవసాయ పొలంలో పెంచిన గంజాయి మొక్కలను ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వెల్దుర్తి మండలంలోని చెట్టుపల్లి తండా సమీపంలో ఉన్న వ్యవసాయ పొలంలో ఎల్లా బోయిన భూపాల్ (25) తన యువకుడు గంజాయి మొక్కలను పెంచుతున్నాడు. విషయం తెలుసుకున్న రామాయంపేట ఎక్సైజ్ సీఐ రాణి, ఎస్ఐ విజయ్ సిద్ధార్థ, సిబ్బందితో కలిసి ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. 12 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నట్లు వారు తెలిపారు. యువకుడు భూపాల్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎక్సైజ్ పోలీసులు పేర్కొన్నారు.