calender_icon.png 4 October, 2025 | 2:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాంలీల రచ్చ... రచ్చ

04-10-2025 01:18:27 AM

- బీఆర్‌ఎస్,కాంగ్రెస్ వర్గాల తోపులాట పోటా పోటీగా రావణ దహనం

కరీంనగర్, అక్టోబర్03(విజయ క్రాంతి): కరీంనగర్ లోని మార్క్‌ఫెడ్ మైదానంలో ప్రతి ఏటా నిర్వహించే రాంలీల కార్యక్రమం రచ్చ రచ్చగా మారింది. విజయక్రాంతి ముం దు చెప్పినట్టు ఉద్రిక్తతల మధ్య కొనసాగింది.ప్రశాంతంగా జరుపుకోవాల్సిన పండ గ అధికార కాంగ్రేస్, ప్రతిపక్ష బి ఆర్ ఎస్ నాయకుల జోక్యం తో ఉద్రిక్త వాతావరణం లో కార్యక్రమము కొనసాగింది. నాయకులు ఆదిపత్యం కోసం చేసే పనుల మూలంగా పండగలు ప్రశాంతతను కోల్పోతున్నాయి.

దసర వేడుకల్లో బాగంగా కరీంనగర్ రాంనగర్ మార్క్ పెడ్ మైదానం లో ఏర్పాటు చేసిన రావణ దహణ కార్యక్రమం అందుకు వేదికయ్యింది .మార్కే పెడ్ గ్రౌండ్ ప్రతియేటా జరిగే రావణ దహనం కార్యక్రమం లో ముందుగా శమీ పూజ నిర్వహించి అనంతరం రాత్రి రావణ దహన కార్యక్రమం చేప డుతారు ఇది గత పదిహేను సంవత్సరాలు గా ఈ మైదానంలో కోనసాగుతుంది ప్రతియేటా లాగే ఈసారి స్థానిక మంత్రి పోన్నం ప్రభాకర్ శమీ పూజ లో పాల్గోని ప్రజలకు దసర శుభాకాంక్షలు తెలిపారు

ఈ క్రమంలో మంత్రి పోన్నం మాట్లాడుతుండగ అక్కడ ఉన్న బిఆర్‌ఎస్ నాయకులు జై గంగుల అం టు నినదించారు దీంతో అసహనానికి లోనై న మంత్రి ఇది రాజకీయ వేదిక కాదు పండు గ అంటు సుతి మెత్తగ హెచ్చరించారు .దీం తో అక్కడ ఉన్న బిఆర్‌ఎస్ నాయకులు నినాదాలను అదేవిధంగా కోనసాగించడంతో వారి దీటుగా కాంగ్రేసు నాయకులు సైతం జై పోన్నం అంటు నినాదాలు ప్రారంబించారు దీంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది పరిస్థితిని పసిగట్టిన పోలీసులు ఇ రువర్గాలను శాంతింపజేసారు ఆపై కార్యక్రమం ముగించుకుని మంత్రి అక్కడి నుండి వెళ్లిపోయారు

ఈ లోగ అక్కడికి మాజి మం త్రి గంగుల చేరుకోవడం తో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది వచ్చిరాగానే కార్యకర్తలతో గంగుల వేదిక పైకి వచ్చారు ఓక్కసారి ఇరువర్గాలు పోటా పోటిగా నినాదాలు చేసారు వెంటనే వేదిక దిగి వచ్చిన గంగుల స్థానిక సిఐ సృజన్ రెడ్డి ని పిలిచి సీరియస్ వార్నిం గ్ ఇచ్చారు మా కార్యకర్తలను ఎలా బెదిరిస్తారు అంటు హెచ్చరించారు ఆ పై ఇరువ ర్గాలు రావణ వద చేసేందుకు పోటి పడ్డారు ఓకరిని ఓకరు తోచికుంటు రావణ వద నిర్వహించారు ప్రతియోట లాగ ఈ సారి రాం లీల మైదానానికి చేరుకున్న నగర ప్రజలు నాయకుల తీరుపై అసహనం వ్యక్తం చేసారు పండుగలను సైతం ప్రశాంతంగా జరుపుకోనివ్వరా అంటు మండి పడ్డారు. దసరాకు ప ది రోజిలు ముందునుండే ఇరు పార్టీ నేతల మధ్య రాంలీల కార్యక్రమం విషయంలో ఆధిపత్య పోరు నడిచింది.

నగరపాలక సంస్థ అధికారికంగా నిర్వహించే ఈ కార్యక్రమాన్ని ఓన్ చేసుకునేందుకు స్థానిక నేతలు పోటీ పడటం. బి ఆర్ ఎస్ ధర్నాకు దిగడం, అధికారులు మార్క్ ఫెడ్ కు తాళాలు వేయడం లాంటి వరుస సంఘటనలు దసరా రోజు ఉద్రిక్తతకు దారి తీశాయి. రావణ దహనం ముగిసే వరకు టెన్షన్ వాతావరణం రాంనగర్ లో చోటు చేసుకుంది. పోలీసుల భారీ బందోబస్తు మధ్య కార్యక్రమము నిర్వహించవలసి వచ్చింది.