బాధ్యతగా విధులు నిర్వర్తించాలి
ఎన్నికల అధికారి ముజమ్మిల్ ఖాన్
మంథని, మే12 (విజయక్రాంతి): లోకసభ ఎన్నికల పోలింగ్ సిబ్బంది విధులను బాధ్యతాయుతంగా నిర్వహించాలని పెద్దపల్లి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సూచించారు. ఆదివారం రామగిరి మండలంలోని మంథని జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల, రామగుండంలోని ఎన్టీపీసీ టీటీఎస్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోలింగ్ సామగ్రి పంపిణీ చేసే సమయంలో అప్పమత్తంగా ఉండాలని కోరారు. రిజర్వ్ ఈవీఎం యంత్రాలు, రిజర్వు పోలింగ్ సామగ్రి సెక్టార్ అధికారుల వద్ద భద్రంగా ఉండాలని సూచించారు. పెద్దపల్లి పార్లమెంట్ నియోజ కవర్గంలో 1,850 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఓటర్లు అందరూ తప్పని సరిగా నేడు ఓటు హక్కు వినియోంచుకోవాలని కోరారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అరుణశ్రీ, మంథని ఎన్నికల అధి కారి(ఆర్డీఓ) హనుమానాయక్ తదిరతులు పాల్గొన్నారు.




