13 April, 2026 | 11:48 AM

Breaking News

మండల ప్రజల సమస్యలు త్వరితగతిన పరిష్కరించండి   •   నోయిడా కార్మికుల నిరసన హింసాత్మకం... వాహనాలకు నిప్పు   •   గ్రామీణ వైద్యులకు షోకాజ్ నోటీసులు జారీ   •   నెట్‌వర్కింగ్ మార్కెటింగ్ ఒత్తిడి: యువకుడి ఆత్మహత్య   •   బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు; కార్మికులు చిక్కుకున్నట్లు అనుమానం?   •   గుజరాత్‌లో ఘోర రోడ్డుప్రమాదం: ట్రక్కు ఢీకొని ఏడుగురు దుర్మరణం   •   కొల్కూర్ గ్రామంలో తొలిసారి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణ   •   ఇంటర్ ఫలితాల్లో రిషి విద్యార్థుల ర్యాంకుల పంట   •   మంత్రి తుమ్మలను కలిసిన మున్సిపల్ వైస్ చైర్మన్, కౌన్సిలర్లు   •   రెడ్డిపల్లి కార్బన్ రిసోర్సస్ సంస్థ వివాదం – హైకోర్టు ఆదేశాలు, అధికారుల అడ్డంకులు   •  

కొత్తగూడెంలో ఓటుకు రూ.500?

13-05-2024 12:39 AM

భద్రాద్రి కొత్తగూడెం, మే 12(విజయక్రాంతి): ఓటర్లను ప్రలోభ పెట్టే ఎలాంటి చర్యలను ఉపేక్షించవద్దని ఎన్నికల కమిషన్ చెప్తున్నా, క్షేత్రస్థాయి అధికారులు నిమ్మకు నిరెత్తినట్టు వ్యవహరిస్తున్నారనే ఆరోపణుల విన్పిస్తున్నాయి. కొత్తగూడెం నియోజకవర్గంలో ఓ పార్టీ నేతలు బహిరంగంగా ఓటుకు రూ.500 చొప్పున పంపిణీ చేస్తున్నా ఎన్నికల అధికారులు పట్టనట్టు వ్యవహరించారు. ప్రజలు సైతం ఓటుకు నోటు కోసం రోడ్లపై పడిగాపులు కాస్తున్నారంటే పరిస్థితి ఏవిధంగా ఉందో తేటతెల్లమవుతోంది.

బీజేపీ కొన్ని ప్రాంతాల్లో ఓటుకు రూ.100 ఇస్తుంటే, బీఆర్‌ఎస్ కొన్ని ప్రాంతాల్లో రూ. 500 ఇస్తుందని, కాంగ్రెస్ ప్రతి ఓటరుకు రూ.500 చొప్పున ఇచ్చి ప్రలోభాలకు గురిచేస్తుందని ప్రచారం జరుగుతోంది. అన్ని పార్టీల నేతలు ఇతర ప్రాంతాల నుంచి వచ్చి గ్రామాల్లో తిరుగుతున్నా ఎన్నికల అధికారులు పట్టించుకోవట్లేదని పలువురు ఆరోపించారు.