ప్రతి దరఖాస్తును పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి
09-12-2024 07:28 PM
అదనపు కలెక్టర్ వేణుగోపాల్...
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): ప్రజావాణిలో వచ్చిన ప్రతి దరఖాస్తును పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ వేణుగోపాల్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడిఓసి కార్యాలయ సమావేశ మందిరంలో అన్ని శాఖల అధికారులతో ప్రజావాణి నిర్వహించి, జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఎండార్స్ చేశారు. ఈ సందర్భంగా దరఖాస్తు చేసిన అభ్యర్థులను వివరాలను అడిగి తెలుసుకొని సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని శాఖల వారీగా అధికారులను ఆదేశించారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.






