అసెంబ్లీలో హరీశ్ మాటలన్ని అబద్ధాలే
- అభివృద్ధి, సంక్షేమాన్ని.. బీఆర్‌ఎస్ ఓర్చుకోవడం లేదు
- రాఘవ కన్‌స్ట్రక్షన్‌తో మంత్రి పొంగులేటికి సంబంధం లేదు
- విప్‌లు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
హైదరాబాద్, మార్చి 31 (విజయక్రాంతి): ‘కాళేశ్వరంపైన కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ నిజాలు బయటపెట్టాడు.. హరీశ్‌రావు ఇప్పుడు తలకా య ఎక్కడ పెట్టుకుంటవు.. గిగ్ వర్కర్ల కోసం చట్టం తీసుకువచ్చాం.. ఇందిరమ్మ బీమా పేరు తో రాష్ట్ర ప్రజలందరకి భరోసా కల్పించినందుకు ఓర్వలేక విమర్శలు. బీసీ కుల గణనను చూసి ఓర్వ లేక బీఆర్‌ఎస్ మాట్లాడుతోంది.’ అని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని తట్టుకోలేక విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.
పదేళ్లు పాల డెయిరీ పెట్టి హరీశ్‌రావు దోచుకున్నారని దుయ్యబట్టారు. మంగళవారం సీఎల్పీ కార్యాలయంలో విప్‌లు ఆది శ్రీనివాస్, బీర్ల అయిల య్య, వేమల వీరేశం, విజయరమణారావు, యెన్నెం శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే మందుల సా మేల్, పాయం వెంకటేశ్వర్లు కలిసి మీడియాతో మాట్లాడారు. హరీశ్‌రావు దోపిడీని చూసి నీటిపారుదలశాఖ నుంచి కేసీఆర్ తప్పించారని తెలిపారు. హరీశ్‌రావు, కేటీఆర్ కలిసి కేసీఆర్‌ను ఫామ్‌హౌస్‌కు పరిమితం చేశారని, బావ, బామ్మర్దలు తమ ఆధిపత్యం కోసం బీఆర్‌ఎస్‌లో కోట్లాడుకుంటున్నారని ఆరోపించారు.
అన్ని ఎన్నికల్లో బీఆర్‌ఎస్ చిత్తుగా ఓడిపోయిందని, తమ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి తట్టుకోలేక విమర్శలు చేస్తున్నారు. హరీశ్‌రావు, కేటీఆర్ అసెంబ్లీ వేదికగా అబద్ధా లను ప్రచారం చేశారని, కొండను తొవ్వి ఎలుకను పట్టినట్లు వారి తీరు ఉందని వేముల వీరే శం అన్నారు. మంత్రి పొంగులేటి అక్రమమైనింగ్ పాల్పడ్డారని అబద్ధపు ఆరోపణలు చేశా రని, రాఘవ కంపెనీకి అసలు మైనింగ్ లేదు, క్రషర్ లేదు.
రాఘవ కన్‌స్ట్రక్షన్స్ పేరుతో క్రషర్, మైనింగ్ ఉంటే చూపించాలి.. పొంగులేటిని బదనాం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు.. తిరుమల కన్‌స్ట్రక్షన్స్ పేరుతో క్రషర్ ఉంది. అక్కడి నుంచి రాఘవ కన్‌స్ట్రక్షన్స్ మెటీరియల్ కొనుగోలు చేసింది.. మెటీరియల్ కొనుగోలు చేయడం కూడా నేరమా? తిరుమల కన్‌స్ట్రక్షన్స్ వాళ్లు ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకొని క్రషింగ్ చేస్తున్నారు. పొంగులేటిని బెదిరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రషర్ పైన అబద్ధాలు తేలిపోవడంతో వట్టి నాగులపల్లికి పోయి విమర్శలు చేస్తున్నారు.
పొంగులేటి 2013 లోనే రాఘవ కన్‌స్ట్రక్షన్స్ నుంచి బయటకు వచ్చారు. 2024 జనవరిలో పొంగులేటి భార్య, కొడుకు కూడా బయటకు వచ్చారు.. అబద్ధాలు, అసత్యాలను పదే పదే చెప్పి సమాజంలో విషం నింపడానికి ప్రయత్నాలు. ల్యాండ్ డెవలప్మెంట్ తీసుకునే ముందు లీగల్ అంశాలను పరిష్కరించాల్సిన బాధ్యత ఓనర్‌దే.. పొంగులేటిని స్వప్రయోజనాలకు కోసం బ్లాక్ మెయిల్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి ’ అని వేమల వీరేశం తెలిపారు.




