ఆల్ఫోర్స్ లో ముందస్తు దీపావళి వేడుకలు
17-10-2025 08:13 PM
సుల్తానాబాద్,(విజయక్రాంతి): చీకటిని నిర్మూలించి వెలుగులను నింపి విజయనందించే పండుగ దీపావళి పండుగ అని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత వి నరేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం సుల్తానాబాద్ లోని ఆల్ఫోర్స్ పాఠశాలలో ముందస్తు దీపావళి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ... దీపావళి పండుగకు ఎంతో విశిష్టత ఉందని పురాతన కాలం నుంచి దీపాలు వెలిగించడంతో ఆ ఇంట్లో సిరిసంపదలు మెండుగా ఉంటాయన్నారు. అనంతరం విద్యార్థులచే లక్ష్మీదేవి పూజతో పాటు దీపావళి విశిష్టతను తెలియజేస్తూ విద్యార్థులు ప్రదర్శించిన నాటిక అందర్నీ ఆకట్టుకుంది.






