calender_icon.png 17 October, 2025 | 10:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కావేరి ఆసుపత్రిలో నవజాత శిశువులకు అరుదైన వైద్యం

17-10-2025 08:09:25 PM

నిర్మల్ రూలర్: నిర్మల్ పట్టణంలోని కావేరి చిల్డ్రన్ హాస్పిటల్ లో  ఐదుగురు నవజాత శిష్యులకు అరుదైన వైద్యం అందించి ప్రాణాలు కాపాడినట్టు ఆసుపత్రి వైద్యులు డాక్టర్ చక్రధరి శ్రీకాంత్ లు తెలిపారు. రెండు నెలల క్రితం తమ హాస్పిటల్కు సోనాలకు చెందిన రచన మస్కాపూర్ కు చెందిన లలిత వడ్డీలకు చెందిన సీతం నవజాత శిశువులను తీసుకురావడం జరిగింది అన్నారు. ముగ్గురు శిశువులు తక్కువ బరువుతో ఉండి వివిధ ఆరోగ్య సమస్యలతో ప్రాణాపాయ స్థితిలో ఉండగా వారికి అరుగుదైన వైద్యం అందించడం  ద్వారా ప్రాణాలు కాపాడాలని వారి కుటుంబ సభ్యులు ప్రాధేయపడినట్లు తెలిపారు.

దీంతో నిర్మల్ ,స్థానిక కావేరి పిల్లల హాస్పిటల్ లోని అత్యాధునిక, హెపాఫిల్టర్స్ ఉన్న మాడ్యులర్ NICU లో చేర్చడం జరిగిందన్నారు. వీరు సీనియర్  పిల్లల వైద్య నిపుణులు డా.అప్పాల చక్రధారి, పిల్లల వైద్య నిపుణులు డా. కావేటి శ్రీకాంత్ మరియు పిల్లల వైద్య నిపుణురాలు డా. కావేటి నాగరంజని, ఇద్దరు DMO లు, అనుభవజ్ఞులైన నర్సింగ్ స్టాఫ్ పర్యవేక్షణలో అన్ని జాగ్రత్తలతో చికిత్స అందించడం జరిగింది. అతి తక్కువ బరువు మరియు నెలలు నిండని కారణంగా ఎదురైన HMD, NEC, SEPSIS, APNEA OF PREMATURITY, NNJ, ROP, ANAEMIA లాంటి ఎన్నో తీవ్రమైన సమస్యలను ఎదుర్కొన్న వారి ఆరోగ్య పరిరక్షణ పై ప్రత్యేక వైద్యం చేయడం జరిగిందన్నారు.

అత్యాధునిక పరికరాలు, వెంటిలేటర్, HFO,HFNC, Surfactant therapy మరియు లాబ్ టెస్టుల సహాయంతో పరిష్కరించడం జరిగింది. వారి ఆరోగ్యం మెరుగుపడి శిశువులనందరిని 1.5 kg బరువు పెరగడంతో శుక్రవారం ఆసుపత్రి నుంచి 45 రోజుల తర్వాత డిశ్చార్జ్ చేయడం జరిగింది అన్నారు. అందులో ముగ్గురు పిల్లలు 12 సంవత్సరాల దాంపత్య జీవితం తర్వాత ఎన్నో రకాల చికిత్సల అనంతరం కలిగిన అపురూప సంతానం. పేర్కొన్నారు పిల్లలకు అరుగుదైన వైద్యం అందించి ప్రాణాలు కాపాడిన వైద్యులకు పిల్లల కుటుంబ సభ్యులు ప్రత్యేక అభినందనలు తెలిపారు అయితే వీరిలో ఇద్దరికీ కవల పిల్లలు ఉన్నారని ఈ ఇద్దరినీ కూడా కాపాడడం జరిగిందన్నారు.