కాకతీయలో ముందస్తుగా కృష్ణాష్టమి వేడుకలు
సిద్దిపేట: సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కాకతీయ టెక్నో హైస్కూల్లో ముందస్తుగా కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చిన్నారి,విద్యార్థినీ, విద్యార్థులు కృష్ణుడు, గోపికల, వేషాధరణాలు అందంగా ముస్తాబై ఔరా అనిపించిఅబ్బురపరిచారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో విద్యార్థులు నృత్యాలతో చేసి,ఉట్టి కొడుతూ ఆబాల గోపాలాన్ని తలపించారు.
ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ట్రస్మా స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ , పాఠశాల కరస్పాండెంట్ జగ్గు మల్లారెడ్డి హాజరై మాట్లాడుతూ విద్యార్థులను చిన్ననాటి నుండి ఆధ్యాత్మిక భావాలను పెంపొందిస్తూ, తల్లిదండ్రుల పట్ల, పెద్దలపట్ల, సేవనిరతిని కలిగేటట్లు చేయడం ప్రతి ఉపాధ్యాయుని బాధ్యత అని తెలిపారు. శ్రీకృష్ణుడు అందరికీ ఆదర్శప్రాయుడని, అందుకే అందరికీ ఇష్ట దైవంగా కొలుస్తారని ఉద్బోధించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ కవిత, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.






