12 July, 2026 | 6:04 AM

భోపాల్ దుర్ఘటనపై ముందే హెచ్చరిక!

02-12-2024 02:31 AM

ప్రమాదానికి ముందే నోటీసులు పంపిన న్యాయవాది

పట్టించుకోని  కార్బైడ్ యూనియన్!

న్యూఢిల్లీ, డిసెంబర్ 1: మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో  విష వాయువులు పీల్చి అనేక మంది  ప్రాణాలు విడిచిన సంగతి తెలిసిందే. 40 ఏండ్ల కింద జరిగిన ఈ ఘటనపై బాధితులు ఇప్పటికీ న్యాయపోరాటం చేస్తున్నారు. దీనిపై తాజాగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కార్బైడ్ యూనియన్ ఫ్యాక్టరీ నుంచి విషవాయువులు వెలువడుతున్నాయని, దాన్ని మూసేయా లని ఘటన జరగకముందే షానవాజ్ ఖా న్ (75) అనే న్యాయవాది ఫ్యాక్టరీ యాజమాన్యానికి నోటీసులు పంపినట్లు తెలిపారు.

తన హెచ్చరికలను ఫ్యాక్టరీ యాజమాన్యం కొట్టిపారేసినట్లు వెల్లడిం చారు. 1983 మా ర్చి4న యూనియన్ కార్బైడ్ ఇండి యా లిమిటెడ్‌కు షానవాజ్ లీగల్ నోటీసులు పంపారట. ‘ప్లాంట్ నుంచి  వె లువడుతున్న వాయువులతో సమీ ప కాలనీల్లోని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఏదైనా జరిగితే కనీసం 50 వేల మంది ప్రాణాలకు ప్రమాదం. ప్రమాదకర రసాయనాల వినియోగాన్ని వెంటనే నిలిపేయాలి. లే కుంటే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది’ అని నోటీసుల్లో పేర్కొన్నట్లు ఖాన్ తెలిపారు.