యువతిని నగ్నంగా నిలబెట్టిన కేటుగాళ్లు
02-12-2024 02:20 AM
ముంబైలో డిజిటల్ అరెస్ట్‌తో మోసం
రూ.1.7లక్షలు కాజేసిన ముఠా
ముంబై, డిసెంబర్ 1: సైబర్ నేరగాళ్లు రోజు రోజుకీ రెచ్చిపోతున్నారు. ముంబైలోని తూర్పు బోరివలి ప్రాం తానికి చెందిన 26ఏళ్ల యువతిని గత నెల 19న డిజిటల్ అరెస్ట్ చేసి రూ.1.7లక్షలను కాజేశారు. వీడియోకాల్ చేసి తమను తాము ఢిల్లీ పోలీ సులుగా పరిచయం చేసుకుని మనీలాండరింగ్‌లో అరెస్ట్ అయిన వ్యా పారవేత్త నరేశ్ గోయల్ కేసులో మీ ప్రమేయం ఉందంటూ కేటుగాళ్లు యువతిని భయభ్రాంతులకు గురి చేశారు.
అనంతరం విచారణ కోసం హోటల్‌లో రూమ్ బుక్ చేయాలని బలవంతం చేసి రూ.1.7లక్షలను దొ చుకున్నారు. బాడీ వెరిఫికేషన్‌లో భా గంగా బట్టలు తీసేయాలని చెప్పి యువతిని నగ్నంగా నిల్చోబెట్టారు. మోసపోయినట్టు గ్రహించిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా అధి కారులు దర్యాప్తు చేస్తున్నారు.






