12 July, 2026 | 7:07 AM

‘ఈవీఎంలను హ్యాక్ చేస్తా’

02-12-2024 02:37 AM

చాలెంజ్ చేసిన వ్యక్తిపై కేసు నమోదు

న్యూఢిల్లీ, డిసెంబర్ 1:  ఈవీఎంలను హ్యాక్ చేయడంతో పాటు ట్యాంపరింగ్ చేయగలనంటూ మహారాష్ట్ర ఎన్నికల అనంతరం ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో వైరల్‌గా మారింది. సయ్యద్ షుజా అనే వ్యక్తి ఈ వీడియో చేసినట్లు ఈసీ గుర్తించింది. ఇతడిపై మహారాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముంబై పోలీసులు నవంబర్ 30న కేసు నమోదు చేశారు. సయ్యద్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని ఈసీ పేర్కొంది.

ఇతడిపై ముం బైలోని సైబర్ పోలీసులు కేసు నమో దు చేసినట్లు తెలిపింది. కాగా 2019లో నూ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఇతడిపై ఢిల్లీలో కేసు న మోదైందని వివరించింది. ఈవీఎంను వైఫై, బ్లూ టూత్ పరికరాలతో అనుసంధానం చేసి ట్యాంపరింగ్ చేయడం అసాధ్యమని మరోసారి స్పష్టం చేసింది.