2 August, 2026 | 1:02 AM

లవ్ జాతరలో శ్రద్ధగా..

02-08-2026 12:00 AM

అంకిత్ కొయ్య, మానస చౌదరి హీరో హీరోయిన్లుగా యూజీ ప్రొడక్షన్ బ్యానర్‌లో సమ్మతమే ఫేమ్ డైరెక్టర్ గోపీనాథ్‌రెడ్డి రూపొందిస్తున్న సినిమా ‘లవ్ జాతర’. ఈ చిత్రాన్ని కంకణాల ప్రవీణ నిర్మిస్తున్నారు. కంప్లీట్ రోలర్ కోస్టర్ లవ్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. శనివారం హీరోయిన్ మానస చౌదరి పుట్టినరోజు.

ఈ సందర్భంగా ఈ సినిమా నుంచి ఆమె పాత్రను పరిచయం చేస్తూ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. మానస చౌదరి ఈ చిత్రంలో శ్రద్ధ పగడాల అనే క్యారెక్టర్‌లో ప్రేక్షకులు అలరించబోతోంది. తాజా పోస్టర్‌లో మానస చౌదరి సంప్రదాయ దుసుల్లో వర్షంలో సంతోషంగా డాన్స్ చేస్తూ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రానికి డీవోపీ: సుజాత సిద్ధార్థ్; సంగీతం: చేతన్ భరద్వాజ్.