calender_icon.png 1 October, 2025 | 10:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం

01-10-2025 09:06:49 AM

మనీలా: సెంట్రల్ ఫిలిప్పీన్స్‌ను(Central Philippines) కుదిపేసిన 6.9 తీవ్రతతో సంభవించిన భూకంపంలో(Earthquake ) మృతుల సంఖ్య 31కి చేరుకుంది. 140 మందికి పైగా గాయపడ్డారు. కూలిపోయిన భవనాల వద్దకు సహాయకులు చేరుకునే కొద్దీ ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు బుధవారం హెచ్చరించారు. దాదాపు 90,000 మంది జనాభా కలిగిన తీరప్రాంత నగరమైన బోగోకు ఈశాన్యంగా 17 కిలోమీటర్ల (10 మైళ్ళు) దూరంలో భూకంప కేంద్రం ఉందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (United States Geological Survey) తెలిపింది. స్థానికంగా ఏర్పడిన ఒక ఫాల్ట్ లైన్ కారణంగా భూకంపం సంభవించింది. పట్టణాలు, గ్రామాలలో భారీగా నష్టం వాటిల్లింది. అత్యంత దెబ్బతిన్న ప్రాంతాలలో ఒకటైన బోగోలో కనీసం 14 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు.

అయితే సహాయక చర్యలు కొనసాగుతున్నందున మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఒక పర్వత గ్రామంలో కొండచరియలు విరిగిపడటంతో గుడిసెల సమూహం నేలమట్టమైంది. దీంతో సహాయకులు ప్రమాదకరమైన భూభాగం గుండా వెళ్లడానికి తీవ్ర ఇబ్బంది పడ్డారు. ప్రమాదాలు ఉన్నందున ఆ ప్రాంతంలో తిరగడం కష్టమని విపత్తు నిర్వహణ అధికారి గ్లెన్ ఉర్సల్ ప్రెస్‌తో అన్నారు. బండరాళ్లు, భూమి కింద చిక్కుకున్న వారి కోసం గాలింపును వేగవంతం చేయడానికి అధికారులు బ్యాక్‌హోతో(Backhoe) సహా భారీ యంత్రాలను తీసుకువచ్చే పనిలో ఉన్నారు. సమీపంలోని శాన్ రెమిజియో పట్టణంలో, ముగ్గురు కోస్ట్ గార్డ్ సిబ్బంది, ఒక అగ్నిమాపక సిబ్బంది, ఒక చిన్నారితో సహా ఆరుగురు మరణించినట్లు వైస్ మేయర్ ఆల్ఫీ రేనెస్ తెలిపారు. డీజెడ్ఎంఎం రేడియోతో మాట్లాడుతూ, రేనెస్ అత్యవసర సహాయ సామాగ్రి కోసం విజ్ఞప్తి చేశారు.