22-11-2025 12:52:52 AM
-ఆరుగురు మృతి.. 65 మందికి గాయాలు
-విషమంగా ముగ్గురి పరిస్థితి
-రిక్టార్ స్కేల్‌పై 5.7 నమోదు
న్యూఢిల్లీ, నవంబర్ 21: బంగ్లాదేశ్ రాజధాని ఢాకా సమీపంలో శుక్రవారం 5.7 తీవ్ర తతో భూకంపం సంభవించింది. భవనాలు చెట్లలా వణికాయి. భవనాలు నేలకూలాయి. ఈ ప్రమాదంలో మొత్తం ఆరుగురు మతిచెందినట్లు, 65 మందికి పైగా గాయప డినట్లు, ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్న ట్లు సమాచారం. భూమి కంపించడంతో భయభ్రాంతులకు గురైన ప్రజలు భవనాల నుంచి కిందికి పరుగులు తీశారు. బంగ్లాదేశ్, ఐర్లాండ్ మధ్య ఢాకాలో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌కు కూడా స్వల్ప అంతరాయం ఏర్పడింది.
కోల్‌కత, ఈశాన్య రాష్ట్రాల్లో కూడా భూమి కంపించింది. రిక్టార్‌స్కేల్‌పై 5.7 తీవ్ర త నమోదైంది. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి పుకార్లు లేదా తప్పుడు సమాచారాన్ని పట్టించుకోవద్దని బంగ్లాదేశ్ తాత్కాలిక పరిపాలన ప్రధాన సలహాదారు ముహమ్మద్ యూనస్ కోరారు. ఢాకా నుంచి 50 కి.మీ దూరంలో, నర్సింగ్డికి నైరుతి దిశలో 13 కి.మీ దూరంలో, 10 కి.మీ లోతులో శుక్రవారం ఉదయం 10:08 గంటలకు భూకంపం సంభవించిందని భారత వాతావరణశాఖ (ఐఎండీ) తెలిపింది.
భూ కంపం సమయంలో ఢాకాలోని బోంగ్‌షాల్‌లో ఒక భవనం రెయిలింగ్ కూలిపోయి, ఆరుగురు మరణించినట్లు ఢాకా ట్రిబ్యూన్ పేర్కొంది. భూకంపం వల్ల రిక్టార్‌స్కేల్‌పై 5.7 తీవ్రత నమోదైందని యూఎస్ జియోలాజికల్ సర్వేపేర్కొంది. క్షతగాత్రులను వివిధ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నట్లు సమా చారం. ఢాకాలో టెస్ట్ మ్యాచ్‌కు భూకంపం స్వల్ప అంతరాయం కలిగించింది.
ఈశాన్య భారత్‌లో కొన్ని సెకన్లపాటు
ఈశాన్య భారత్‌లో కూడా భూకంపాలు సంభవించాయి. కోల్‌కతాలో ఉదయం 10:10 గంటల ప్రాంతంలో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో అనేక మంది ప్రజలు ఆందోళనకు గురయ్యారు. కూచ్ బెహార్, దక్షిణ్, ఉత్తర దినాజ్‌పూర్‌తో సహా పశ్చిమ బెంగాల్, గౌహతి, అగర్తల, షిల్లాంగ్ వంటి నగరాల్లో కూడా భూకంపాలు సంభవించాయి. భారత్‌లో ఎటువంటి ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. శుక్రవారం తెల్లవారుజామున పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్‌లో కూడా మోస్తరు భూకంపాలు వచ్చాయని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ(ఎన్‌సీఎస్) పేర్కొంది.