22-11-2025 12:39:45 AM
-తక్షణమే అమలు
-29 కార్మిక చట్టాలు రద్దు
-ఇది చారిత్రాత్మకమైనది : ప్రధాని మోదీ
న్యూఢిల్లీ, నవంబర్ 21: భారత చరిత్రలో అతిపెద్ద కార్మిక సంస్కరణలు అమల్లోకి వచ్చాయి. నాలుగు కార్మికకోడ్‌లను తక్షణ మే అమల్లోకి తెచ్చారు. 29 కార్మిక చట్టాలను రద్దు చేశారు. భారత ప్రభుత్వం శుక్రవా రం నుంచి నాలుగు కార్మిక కోడ్‌లను అమల్లోకి తీసుకొచ్చింది. 29పాత కేంద్ర చట్టా లను ఏకీకృతం చేసి, డిజిటల్, గిగ్ ఎకానమీకి అనుగుణంగా ఈ కోడ్‌లను రూపొందించింది. ఈ నాలుగు కోడ్‌లు కార్మికుల హక్కు లను బలోపేతం చేయనున్నాయి. ఈ చారిత్రక నిర్ణయం దేశ కార్మిక వ్యవస్థను ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా మారుస్తుందని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు.
ఈ కోడ్‌లు 2019 మధ్య పార్లమెంట్‌లో ఆమోదించి, కోడ్‌లపై ఆధారపడి, 1930 మధ్య తయారు చేసిన చట్టాలను భర్తీచేస్తుంది. ఈ సంస్కరణల ద్వారా కార్మికుల సామాజిక భద్రతా కవరేజ్ 2015 లో 19 శాతం నుంచి 2025లో 64 శాతానికి పెరిగిందని, మరింతగా రక్షణ ఇస్తుందని కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ అంశంపై ప్రధాని మోదీ స్పందించారు. ‘స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇది అత్యంత ప్రగతిశీల కార్మికఆధారిత సంస్కరణలలో ఒకటి. ఇది కార్మికులకు ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. అంతేకాకుండా ఇది చట్ట పరమైన ప్రక్రియలను చాలా సులభంగా మారుస్తుంది. వ్యాపారం చేయడంలో సౌలభ్యాన్ని కూడా ప్రోత్సహిస్తుంది’ అని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.
నాలుగు రకాల కోడ్‌లు
1.వేతనాల కోడ్(వేజెస్ కోడ్): మినిమమ్ వేజెస్‌కు చట్టపరమైన హక్కు, టైమ్లీ వేజ్ పేమెంట్, గిగ్, ప్లాట్‌ఫాం వర్కర్లకు పీఎఫ్, ఈఎస్‌ఐసీ, ఇన్సూరెన్స్ తదితర యూనివర్సల్ సామాజిక భద్రత. మహిళలకు నైట్ షిఫ్ట్‌లు అనుమతి, ట్రాన్స్‌జెండర్లకు జెండర్ నిబంధనలు.
2. ఇండస్ట్రీయల్ రిలేషన్స్ కోడ్: ఫ్యాక్టరీల పరిధిని పెంచి, చిన్న వ్యాపారులకు సులభతర, ఫిక్స్‌డ్ గిగ్, కాంట్రాక్ట్ కార్మికులకు రక్షణ, ఇద్దరు సభ్యుల పరిశ్రమల ట్రిబ్యునల్‌ల ద్వారా వేగవంతమైన వి వాద పరిష్కారం.
3. సోషల్ సెక్యూరిటీ కోడ్: పాన్ ఇండి యా ఈఎస్‌ఐసీ కవరేజ్, 40 ఏళ్లు పైబడిన కార్మికులకు ఫ్రీ యాన్యువల్ హెల్త్ చెకప్‌లు. మైగ్రెంట్, ఇన్ఫార్మల్ లేబర్స్‌కు బెనిఫిట్స్ పోర్టబిలిటీ, ఎంఎస్‌ఎంఈ, బీడీ/ ప్లాంటేషన్/టెక్స్‌టైల్/డాక్/ఆడియో మీడియా/మైన్/హాజార్డస్/ఐటీ/ఐటీఈఎస్/ఎక్స్‌పోర్టు సెక్టార్లకు ప్రత్యేక రక్షణలు.
4.ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కిం గ్ కండిషన్స్(ఓఎస్‌హెచ్‌డబ్ల్యూసీ)కోడ్: భ ద్రతా కమిటీలు(500+వర్కర్ల యూనిట్ల లో), నేషనల్ ఓఎస్‌హెచ్ బోర్డ్ ద్వారా స్టాం డర్డుజ్డ్ సేఫ్టీ నార్మ్స్. ఇన్‌స్పెక్టర్ ఫెసిలిటేటర్ సిస్టమ్ ద్వారా గైడెన్స్ అప్రో చ్. ఈ కోడ్‌లు కార్మికులకు మ్యాండేటరీ అపాయింట్‌మెంట్ లెటర్స్, నేషనల్ ఫ్లోర్ వేజ్, మహిళలు/యూత్/ కాంట్రాక్ట్ వర్కర్లకు ప్రత్యేక హక్కులు అందిస్తాయి.20 19 మధ్య పార్లమెంట్‌లో ఆమోదించిన ఈ కోడ్‌లు, సంప్రదింపుల తర్వాత నవంబర్ 21, 2025 నుంచి అమలులోకి వచ్చాయి.
పాతచట్టాలలోని రూల్స్, నోటిఫికేషన్‌లు స్టేక్‌హోల్డర్ల సంప్రదింపుల తర్వాత మార్చుతారు. ప్రభుత్వం ‘హిస్టారిక్ డెసిషన్’ గా పేర్కొంటూ, ‘ప్రొటెక్టెడ్, ఫ్యూచర్ వర్క్‌ఫోర్స్, రెసిలియెంట్ పరిశ్రమలు’ సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సంస్కర ణ లు ఆత్మనిర్భర్ భారత్‌కు ఉద్యోగాల సృష్టికి దోహదపడుతాయని మంత్రిత్వ శాఖ పే ర్కొంది. అలాగే ఈ సంస్కరణలు పాతచట్టాలలోని కాలం చెల్లిపోయిన రూల్స్‌ను తొలగించి, డిజిటల్ ఎకానమీకి సరిపోయేలా చేశాయి. రాష్ట్రాలు తమ చట్టాలను కేంద్ర చట్టాలకు అనుగుణంగా మార్చాల్సి ఉంది. ఈ కొత్త చట్టాల ద్వారా దేశంలోని దాదాపు 64శాతం మంది కార్మికులకు సామాజిక భద్రతా రక్షణ లభిస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
రక్షణ ఇలా..
- ఉద్యోగులందరికీ నియామక పత్రం తప్పనిసరి. దీంతో ఉద్యోగ భద్రత, పారదర్శకత, స్థిరమైన ఉపాధికి రాతపూర్వక హామీ.
- ఎఫ్‌టీఈలకు ఐదేళ్లకు బదులుగా కేవలం ఒక సంవత్సరం సర్వీస్ పూర్తయిన తర్వాతే గ్రాట్యుటీకి అర్హత లభించనుంది.
- యజమానులు సకాలంలో వేతనాలు చెల్లించడం తప్పనిసరి. ఐటీ ఉద్యోగులకు ఏడో తేదీలోపు చెల్లింపులు చేయాల్సి ఉంటుంది.
- బీడీ, సిగరెట్లు, మైనింగ్ పరిశ్రమల్లో పనిచేసేవారికి 8 నుంచి 12 గంటల వరకు పనిచేయొచ్చు. వారానికి 48 గంటలు మించొద్దు. 30 రోజుల పని పూర్తి చేసుకుంటే బోనస్‌కు అర్హత లభించనుంది.
- సాధారణ పనిగంటలు దాటి పనిచేస్తే రెగ్యులర్ వేతనానికి రెట్టింపు చెల్లించాలి. రాత్రి షిఫ్టుల్లో, అన్ని రకాల పనుల్లో (అండర్ గ్రౌండ్ మైనింగ్ సహా) పనిచేయడానికి మహిళలకు అనుమతి. అవసరమైన భద్రతా చర్యలు, వారి సమ్మతి తప్పనిసరి.
- మహిళా ఉద్యోగుల కుటుంబంలో అత్తమామలకు చోటు దక్కింది. తద్వారా ‘డిపెండెంట్ కవరేజ్’ పెరుగుతుంది.
- ఆధార్ యూనివర్సల్ అకౌంట్ నంబర్(యూఏఎన్) ద్వారా సామాజిక భద్రత ప్రయోజనాలు రాష్ట్రాల మధ్య వలసలతో సంభంధం లేకుండా పూర్తిగా పోర్టబుల్‌గా ఉంటాయి.