calender_icon.png 22 November, 2025 | 1:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గవర్న ర్లకు గడువు తప్పనిసరి

22-11-2025 12:54:42 AM

రాజ్యాంగ సవరణ చేపట్టే వరకు విశ్రమించబోం : స్టాలిన్   

చెన్నై, నవంబర్ 21:బిల్లుల ఆమోదంపై రాష్ట్రపతి, గవర్నర్లకు సమయపరిమితి విధించలేమి భారత అత్యున్నత న్యాయస్థానం ఇటీవల స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ పరిణామంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్పందించారు. బిల్లులు ఆమో ద దశకు చేరాలంటే గవర్నర్లకు తప్పనిసరిగా గడువు ఉండాలని ఆయన పేర్కొన్నారు. ఇందుకు అవసరమైన రాజ్యాంగ సవరణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ గవర్నర్లకు నిర్ణయ గడువు విధించే వరకు తాను వెనకడుగు వేసేది లేదని స్టాలిన్ స్పషం చేశారు.

రాష్ట్రపతి ముర్ము అడిగిన ప్రశ్నలకు సుప్రీంకోర్టు చేసిన సూచనలపై సీఎం స్టాలిన్ స్పందిస్తూ రాష్ట్ర హక్కుల కోసం పోరాడనున్నట్లు తెలిపారు. రాష్ట్ర హక్కులు నిజమైన ఫెడరల్ స్ఫూర్తికోసం తమ పోరాటం కొనసాగుతుందన్నారు. తమిళనాడు రాష్ట్రం, గవర్నర్ మధ్య జరిగిన కేసులో 2025 ఏప్రి ల్ 8న ఇచ్చిన తీర్పుపై ఎటువంటి ప్రభావం చూపదని స్టాలిన్ పేర్కొన్నారు.‘గవర్నర్‌కు బిల్లును చంపేయడం, తన వద్దే పడేసి పెట్టుకోవడం, పాకెట్ విటోవాడడం వంటి అవ కాశం లేదు. బిల్లును అలాగే వదిలేయడం, హోల్డ్ చేయడం వంటి జనరల్ ఆప్షన్ కూడా గవర్నర్‌కు లేదు. ఇది సుప్రీంకోర్టు స్పష్టత ఇచ్చిన అంశం’ అని స్టాలిన్ అన్నారు.