ఈజీ గ్రోయింగ్ ఇండోర్ ప్లాంట్స్
బాల్కనీ గార్డెన్, ఇండోర్ ప్లాంట్స్ ఎప్పుడూ కొత్త ఉత్సాహాన్నీ, ఇంటికి అందాన్నీ ఇస్తాయి. అయితే సరైన ఎండ తగలకపోతే కొన్ని మొక్కలు బతకలేవు. మరికొన్ని బాల్కనీలో పెంచటానికి అనువుగా ఉండవు. ప్రేమగా తెచ్చుకున్న మొక్కలు చనిపోతుంటే బాధగా ఉంటుంది. అందుకే ఎంచుకునేటప్పుడే ఇంటి వాతావరణాన్ని బట్టి ఎలాంటి మొక్కలు సరిపోతాయో తెలుసుకుంటే చక్కగా పచ్చని మొక్కలతో ఇంటిని అలంకరించుకోవచ్చు. అలాంటి కొన్ని మొక్కలని ఇప్పుడు చూద్దాం.
స్పుడర్ ప్లాంట్
సూర్యరశ్మి తక్కువగా ఉండే గదుల్లో పెంచటానికి స్ర్పైడర్ ప్లాంట్ చాలా అనువైన మొక్క. దీన్ని ఒక్కసారి కొంటే చాలు. వేగంగా పిలకలు వేస్తుంటుంది గనక వాటినే మిగతా చోట్ల పెట్టుకోవచ్చు. ఎండ తగలని చోటులో కూడా చక్కగా పెరుగుతుంది ఈ మొక్క. హ్యాంగింగ్ పాట్ లో అయినా, కుండీలో అయినా పెంచుకోవచ్చు. మరీ ఎక్కువ మెయింటెనెన్స్ కూడా ఉందదు. వీటికి వారినికొకసారి నీరు పోస్తే చాలు. వాటంతట అవి ఏపుగా పెరుగుతాయి.
మనీ ప్లాంట్:
ఇంట్లో ఏ మూలనైనా, ఎలా పెంచినా అందంగా కనిపించే మొక్క మనీ ప్లాంట్. వారానికోసారి అలా నీళ్లు పోస్తే చాలు హాయిగా పెరుగుతాయి. లివింగ్ రూం లో గోడలకి పాకించినా, బెడ్ రూం లో చిన్న పాట్ లో ఉంచినా పచ్చగా కళకళలాడుతూ పెరుగుతుంది మనీ ప్లాంట్.
బోస్టన్ ఫెర్న్
వేలాడే కుండీలలో పెంచటానికి చాలా అనువుగా ఉండే మొక్క ఇది. బాల్కనీలో వేలాడదీసి ఉంచితే ఇంటికే కొత్త అందం వస్తుంది. రోజూ కాసిని నీళ్లు వేసి మట్టి తడి ఆరిపోకుండా చూసుకుంటే చాలు. ఎప్పుడూ పచ్చగా కనిపిస్తుంది. నర్సరీలో హ్యాంగింగ్ పాట్స్ ప్లాంట్స్ లో మొదటి చాయిస్ గా బోస్టన్ ఫెర్న్ ఉంటుంది.
స్నేక్ ప్లాంట్
ఎండ అవసరం ఉండదుగానీ కొద్దిగా వెలుతురు వచ్చే చోట స్నేక్ ప్లాంట్ పెట్తాలి. కిటికీల దగ్గరా, బాల్కనీలో స్నేక్ ప్లాంత్ ని ఉంచితే చూడటానికి అందంగా కనిపించటమే కాదు దాని చుట్టుపక్కల చల్లదనాన్ని కూడా పెంచుతుంది ఈ మొక్క.
పీస్ లిల్లీ
దీనికి కొద్దిగా ఎండ తగిలితే సరి పోతుంది. నాలుగు రోజులకు ఒక సారి నీళ్ళు పోస్తే సరిపోతుంది. మట్టి ఆరకుండా ఉంటే చాలు పెద్ద పెద్ద ఆకులతో ఎంతో అందంగా పెరుగుతుంది. బెడ్ రూమ్‌లో, హాల్లో, స్టడీ రూమ్‌లో ఎక్కడ పెట్టినా అందం వస్తుంది.
గులాబీ
గులాబీ మొక్కలు పెంచుకోవాలని అనుకోని వారుండరేమో. కానీ, ఈ మొక్కలని ఇంటిలోపల పెట్టే ప్రయత్నం చేయకపోవటమే మంచిది. ఇవి బాల్కనీల్లో, అదీ ఎండ బాగా తగిలే అవకాశం ఉన్నచోట మాత్రమే పెరుగుతుంది






