12 July, 2026 | 7:08 AM

గుడ్డు కావాలా? పన్నీర్ కావాలా?

06-05-2024 12:00 AM

ఆరోగ్యంగా, అందంగా ఉండాలంటే కొన్ని రకాల ఫుడ్స్ ఎంతో హెల్ప్ చేస్తాయి. ముఖ్యంగా ప్రొటీన్, కాల్షియం చాలా అవసరం. ఇతర పోషకాలు కూడా చాలా అవసరం. గుడ్లు, పన్నీర్ కూడా ప్రొటీన్, కాల్షియంలో భాగమే. వీటిల్లో ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి. గుడ్లు, పన్నీర్ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. పనీర్ తేలికపాటి, క్రీమీ రుచిని కలిగుంటుంది. గుడ్లు తేలికపాటి ఉప్పగా ఉంటాయి. అలాగే మంచి టేస్టీగా కూడా ఉంటాయి. అయితే శాకాహారులకు పన్నీర్ ఎక్కువ ప్రొటీన్‌ని ఇచ్చే ఆహారం. కానీ మాంసాహారులకు ప్రొటీన్ లభించే దారులు చాలానే ఉన్నాయి. 

మొత్తం గుడ్డులో 6 గ్రాముల ప్రొటీన్‌తో పాటుగా శరీర సాధారణ పనితీరుకు అవసరమైన పోషకాలు చాలా ఉంటాయి. ఒక ఉడికించిన గుడ్డులో సుమారు 44 గ్రాముల పోషకాలు ఉంటాయి. 5.5గ్రాముల ప్రొటీన్, 4.2 గ్రాముల కొవ్వు ఉంటుంది. కొలెస్ట్రాల్, జింక్, సెలీనియం, పొటాషియం, భాస్వ రం, మెగ్నీషియం, ఐరన్, కాల్షియం వంటి ఇతర ఖనిజాలు ఉంటాయి.   పొదుపరులకు చెప్పే అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే ఒక గుడ్డు ధర పన్నీర్‌తో పోల్చి చూస్తే చాలా తక్కువ. 

పన్నీర్ పోషకాల విషయంలో గుడ్డుకంటే ఏమాత్రం తగ్గదు. కానీ శాకాహారుల డైటింగ్ విషయంలో ముఖ్యంగా బరువు తగ్గాలని అనుకునే వాళ్లకి మంచి ఆప్షన్‌గా నిలుస్తుంది. 100గ్రాముల పన్నీర్‌లో 7.54గ్రాముల ప్రొటీన్,  విటమిన్ బి12, రిబోప్లోవిన్, విటమిన్ డి, సెలీనియం వంటివి ఇతర పోషకాలు ఉంటాయి. ఇవి శరీరానికి ఎంతో అవసరమైనది.

అయితే ఇక్కడ కూడా గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే పన్నీర్, గుడ్లు రెండూ దాదాపు సమానమైన పోషకాలే కలిగి ఉన్నా సహాయపడినా గుడ్ల కంటే పన్నీర్‌లో తక్కువ క్యాలరీలు ఉంటాయి. 

గుడ్లు, పన్నీర్‌తో పాటుగా చికెన్, జున్ను, బీన్స్, ముంగ్ బీన్స్, బ్లాక్ బీన్స్, కిడ్నీ బీన్స్, బ్రోకలీ వంటి వాటిలో కూడా ప్రొటీన్ పుష్కలంగా ఉంటుంది.         ఒకవేళ గుడ్లు తినలేని వాళ్లు, పన్నీర్ అంటే నచ్చని వాళ్లు పైన చెప్పిన వాటిని తీసుకోవచ్చు.