26 June, 2026 | 3:11 PM

వడ్డీ రేట్లు తగ్గించిన ఈసీబీ

07-06-2024 12:18 AM
  • పావు శాతం కోత

మిలన్, జూన్ 6: యూఎస్ కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్‌కంటే ముందుగానే యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ (ఈసీబీ) వడ్డీ రేట్లను తగ్గించింది. బ్యాంక్ కీలక డిపాజిట్ రేటును పావుశాతం తగ్గిస్తున్నట్టు ఈసీబీ ప్రెసిడెంట్ క్రిస్టినె లగార్డే ప్రకటించారు. దీంతో ఈసీబీ డిపాజిట్ రేటు 3.75 శాతానికి దిగివస్తుంది. దీంతో యూరప్‌లో బ్యాంక్‌ల రుణ రేట్లు సైతం తగ్గుతాయి. ద్రవ్యోల్బణం పరిస్థితి బాగా మెరుగుపడినందున రేటులో కోత విధిస్తు న్నట్టు లగార్డే తెలిపారు.