విప్రోకు 500 మిలియన్ డాలర్ల డీల్
07-06-2024 12:15 AM
ముంబై, జూన్ 6: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దిగ్గజం విప్రో తాజాగా ఒక భారీ కాంట్రాక్టును సాధించింది. యూఎస్ కమ్యూనికేషన్ సర్వీసుల సంస్థ నుంచి 500 మిలియన్ డాలర్ల విలువైన డీల్ లభించిందని విప్రో గురువారం స్టాక్ ఎక్సేంజీలకు తెలిపింది. ఐదేండ్ల కాలానికి ఈ డీల్ వర్తిస్తుందన్నది. కాంట్రాక్టులో భాగంగా కమ్యూనికేష న్స్ పరిశ్రమకు అవసరమైన సొల్యూషన్స్‌ను అందించడంతో పాటు సర్వీ సుల్ని విప్రో నిర్వహిస్తుంది.






