29-07-2025 12:19:55 AM
ఘట్ కేసర్, జులై 28 : ఘట్ కేసర్ మం డల పరిషత్ ప్రాథమిక పాఠశాలను తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమీష న్ సభ్యురాలు గోగుల సరిత వెంకటేష్ సో మవారం సందర్శించారు. ఈసందర్భంగా ఆమె పాఠశాలలోని విద్యార్థులతో మమేక మై వారితో ఆప్యాయంగా సంభాషించారు. విద్యార్థుల చదువు పట్ల ఆసక్తి, పాఠశాలలో అందిస్తున్న సదుపాయాలు, మధ్యాహ్న భో జనం నాణ్యత వంటి అంశాలను సమీక్షించారు.
గోగుల సరిత వెంకటేష్ మాట్లాడు తూ బాలల విద్య, ఆరోగ్యం, భద్రత కోసం ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోందని, ప్ర తి పిల్లవాడు చదువులో ముందుకు సాగి మంచి భవిష్యత్తు సాధించాలని సూచించా రు. ఆమె పిల్లలకు పరిశుభ్రత ప్రాముఖ్యతను వివరించి, చేతులు కడుక్కోవడం, శు భ్రంగా ఉండటం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు.
ఉపాధ్యాయులతో సమావేశమై పాఠశాల బోధన విధానాలు, సదుపాయా లు, పిల్లలకు అందించే రక్షణ చర్యలపై చ ర్చించారు. అవసరమైన చోట మరింత సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటా మని హామీ ఇచ్చారు. ఈసందర్శనలో ము న్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షులు మామిళ్ల ము త్యాల యాదవ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బొక్క సంజీవరెడ్డి, ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి మేకల సునీల్ కుమార్, రాజు తది తరులుపాల్గొన్నారు.