13-12-2024 10:39:06 AM
హైదరాబాద్: భూదాన్ భూముల కుంభకోణంలో కీలక పరిణామ చోటుచేసుకుంది. నలుగురికి ఈడీ నోటీసులు ఇచ్చింది. నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి, వంశీరాం బిల్డర్స్ సుబ్బారెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. మరో ఇద్దరికి కూడా నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. ఈనెల 16న విచారణకు హాజరుకావాలని ఈడీ నోటీసుల్లో పేర్కొంది. ఇప్పటికే ఐఏఎస్ అమోయ్ ను ఈడీ పలుమార్లు విచారించింది. భూదాన్ భూముల స్కాంలో సూర్యతేజ, సిద్ధారెడ్డి లాభపడినట్లు గుర్తించారు.