calender_icon.png 11 September, 2025 | 1:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బేగంబజార్‌లో దారుణం.. భార్య, కుమారుడి హత్య

13-12-2024 10:04:11 AM

హైదరాబాద్: హైదరాబాద్‌లోని బేగంబజార్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన భార్యను, కొడుకును హత్య చేసి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతని భార్య( హేలియా) గొంతు కోసి, కుమారుడు హైజాన్ గొంతు నులిమి చంపాడు. ఈ ఘటనలో భార్య, కొడుకులు మృతి చెందగా, నేరస్థుడిని సిరాజ్‌గా గుర్తించారు. హత్యలు చూసి సిరాజ్ పెద్ద కుమారుడు భయంతో ఘటనా స్థలం నుంచి తప్పించుకోగలిగాడు. కుటుంబ కలహాలే ఈ హింసాత్మక ఘటనకు దారితీసి ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు. సిరాజ్ కుటుంబం ఉత్తరప్రదేశ్ నుంచి వలస వచ్చింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం దర్యాప్తు చేస్తున్నారు. ఈ దారుణ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.