12-09-2025 10:48:52 AM
తాండూరు, (విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా తాండూర్ మండలం సంఘం కలాన్ గ్రామానికి చెందిన రైతు మొగులప్ప గత గురువారం పొలం పనులకు వెళ్లి తిరిగి ఇంటికి వెళుతుండగా వాగు దాటే క్రమంలో వర్షపు నీటి ఉధృతికి కొట్టుకుపోయి గల్లంతైన విషయం తెలిసిందే. గతరాత్రి వరకు రెవిన్యూ పోలీస్ అధికారులు(Revenue Police Officers) గాలించిన లాభం లేకుండా పోయింది. వర్షపు నీటి ఉధృతి తగ్గడంతో నేడు ఉదయం గ్రామస్తులు మొగులప్ప ఆచూకీ కోసం గాలిస్తుండగా శవమై కనిపించాడు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.