12-09-2025 09:53:02 AM
సిద్దిపేట జిల్లా జక్కాపూర్ గ్రామంలో విషాదం
సిద్ధిపేట రూరల్: జక్కాపూర్ గ్రామంలో అత్యంత విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. భర్త మరణం తట్టుకోలేక భార్య పురుగుల మందు సేవించి మృతి చెందడంతో గ్రామమంతా శోకసంద్రంలో మునిగిపోయింది. సిద్దిపేట జిల్లా(Siddipet District) నారాయణరావుపేట మండలంలోని జక్కాపూర్ గ్రామానికి చెందిన కొబ్బరిచెట్టు మహేందర్ (40) వారం రోజుల క్రితం వ్యవసాయ పనుల నిమిత్తం ట్రాక్టర్ నడుపుతుండగా ఒక్కసారిగా కుప్పకూలాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా వైద్యులు ఆయనకు పక్షవాతం అని గుర్తించారు. అప్పటి నుండి మంచానికే పరిమితమయ్యాడు. గురువారం రాత్రి మహేందర్ మృతిచెందాడు. భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య కావ్య (33) పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకుంది. దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ దుర్ఘటనతో గ్రామమంతా విషాద ఛాయలు అలుముకున్నాయి.