calender_icon.png 12 September, 2025 | 1:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎల్‌ఎండీ పది గేట్లు ఎత్తి 36000 క్యూసెక్కుల నీటి విడుదల

12-09-2025 11:02:44 AM

కరీంనగర్,(వికాయక్రాంతి): ఇటీవల కురుస్తున్న వర్షాలకు దిగువ మాన ఎల్‌ఎండీ జలాశయంలోకి రిజర్వాయర్‌లోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు 10గేట్లను ఎత్తి 36000 క్యూసెక్కుల నీటిని దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. కాగా, ప్రస్తుతం గత మూడు రోజులుకు కురుస్తున్న భారీ వర్షాలతో ఇన్ ఫ్లో 30545 క్యూసెక్ లకు చేరింది. మోయతుమ్మెద వాగు నుంచి 23745 క్యూసెక్కులు, మిడ్‌ మానేరు నుంచి 6000 క్యూసెక్కులు, కాకతీయ కాలువ నుంచి 800 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నది. పర్ ప్రస్తుతం 23.558/24.034 టీఎంసీల నీరు నిల్వ ఉంది.  రిజర్వాయర్‌ నుండి 10గేట్లు ఎత్తి 36000 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. కాకతీయ కాలువ ద్వారా2500 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 309 క్యూసెక్కులు ఔట్‌ ఫ్లో ఉన్నది. ఎగువ నుంచి ఇన్‌ఫ్లో పెరిగితే మరిన్ని గేట్లు తెరువనున్నారు.