calender_icon.png 12 September, 2025 | 12:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజా సేవలో పోలీస్

12-09-2025 10:20:59 AM

గార్ల,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలోని రైతు వేదిక(Rythu Vedika) వద్ద రైతులకు యూరియా సకాలంలో అందడంలో ఆలస్యం అవుతుంది. యూరియా కోసం రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. తెల్లవారుజాము నుంచే రైతులు లైన్లో నిల్చొని పడరాని పాట్లు పడుతున్నారు. రైతుల ఇబ్బందులు గమనించిన బయ్యారం పోలీస్ స్టేషన్(Bayyaram Police Station)లో విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ దినేష్, రజినీ లు స్వచ్ఛందంగా సహకరించి, వ్యవసాయ శాఖ సిబ్బందికి తోడ్పాటుగా నిలిచి రైతులకు సమయానికి యూరియా అందేలా చేశారు. యూరియా సకాలంలో అందేలా సహకరించిన పోలీసులకు రైతులు అభినందనలు తెలిపారు. ఈ సందర్బంగా గార్ల, బయ్యారం సీఐ రవికుమార్ రైతువేదిక వద్దకు చేరుకొని రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.రైతుల సంక్షేమానికి పోలీసులు ఎల్లప్పుడూ అండగా ఉంటారని హామీ ఇచ్చారు.ఎవరైనా రైతులకు మోసం చేసి, యూరియాను అధిక ధరలకు విక్రయిస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.