రాజ్‌కుంద్రాకు ఈడీ నోటీసులు
దాడులు జరిగిన తర్వాతి రోజే చర్యలు
ముంబై, డిసెంబర్ 1: అశ్లీల చిత్రాలకు సంబంధించి విచారణకు రావాల్సిందిగా బాలీవుడ్ సీనియర్ నటి, శిల్పాశెట్టి భర్త, ప్రముఖ వ్యాపారవేత్త రాజ్‌కుంద్రాకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్( ఈడీ) నోటీసులు జారీ చేసింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పోర్న్ రాకెట్ కేసులో ప్రశ్నించేందుకు రాజ్‌కు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ క్రమంలో సోమవారం రాజ్‌కుంద్రాను ఈడీ విచారించనున్నట్లు సమాచారం. ఈ కేసులో ఇంకా ఎవరెవరికి సంబంధాలున్నాయన్న కోనంలో ఈడీ ఆరా తీస్తోంది.
దీంతో సంబంధమున్న మరికొంతమందికి కూడా ఈడీ నోటీసులు ఇచ్చినట్లు జాతీయ మీడియాతో కథనాలు వచ్చాయి. కాగా ఇటీవలే రాజ్‌కుంద్రాకు సంబంధమున్న పలు చోట్ల ఈడీ సోదాలు నిర్వహించింది. సోదాల్లో లభించిన సమాచా రం ఆధారంగా సమ న్లు జారీ చేసి విచారణకు పిలిచినట్లు భా విస్తున్నారు. పోర్న్ వీడియోలను తీసి పలు యాప్‌ల ద్వారా వాటిని విడుదల చేస్తున్నారని 2021లో ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీ సులు కేసు నమోదు చేసి రాజ్‌కుంద్రాను అరెస్ట్ చేశారు.
అనంతరం బెయిల్‌పై బయటకు వచ్చారు. సినిమా అవకాశాల కోసం ముంబైకి వచ్చే యువతులను మో సం చేసి రాజ్ భారీగా సంపాదించినట్లు పేర్కొన్నారు. పోర్న్ కేసులో రాజ్‌కుంద్రాయే ప్రధాన నిందితుడని పోలీసులు పేర్కొన్నారు.






