గొర్రెల పంపిణీ పథకం కుంభకోణంపై ఈడీ కేసు నమోదు
హైదరాబాద్: గొర్రెల పంపిణీ పథకంలో జరిగిన అవినీతి, నిధుల దుర్వినియోగంపై ఈడీ కేసు నమోదు చేసింది. గొర్రెల పంపిణీ పథకంలో రూ.700 కోట్లు అవినీతీ జరిగిందని, ఈ కేసులో పది మంది నిందితులు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.ఏసీబీ కేసు ఆధారంగానే ఈడీ మనీలాండరింగ్ చట్టం కింద ఈసీఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. విచారణలో భాగంగా తమకు అవసరమైన వివరాలను సమర్పించాలని తెలంగాణ స్టేట్ షీప్ అండ్ గోట్ డెవెలప్‌మెంట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ ఎండీకి ఈడీ అధికారులు లేఖ రాశారు. జిల్లాల వారీగా లబ్ధిదారుల పేర్లు, వారి అడ్రస్‌లు, ఫోన్ నంబర్లు, బ్యాంకు ఖాతాల వివరాలు, గొర్రెల రవాణాలో కాంట్రాక్టు కుదుర్చుకున్న ఏజెన్సీల వివరాలు తదితర సమాచారం ఇవ్వాలని ఈడీ కోరింది. ఇప్పటికే ఈ కేసులో పలువురు పశుసంవర్థకశాఖ అధికారులను పోలీసులు అరెస్టు చేశారు.






