15-10-2025 01:10:38 AM
ట్రావెల్ ప్లానింగ్ సులభతరం
హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 14 (విజయక్రాంతి): హైదరాబాద్‌లో విశ్వసనీయ హాస్పిటాలిటీ బ్రాండ్లలో ఒకటి అయిన ఈడెన్ హోమ్ స్టే తన కొత్త ఆన్లైన్ బుకింగ్ పోర్టల్ edenhomestay.coను ఆవిష్కరించింది. ఈ కొత్త ప్లాట్‌ఫారమ్ భారతీయ, అంతర్జాతీయ ప్రయాణికులకు బుకింగ్ ప్రక్రియను వేగవంతం, సులభం, సమగ్రంగా మార్చేందుకు రూపొందించబడింది.
కొత్త వ్బుసైట్ ఆధునిక డిజైన్, వేగవంతమైన లోడింగ్, మొబైల్, టాబ్లెట్, డెస్క్‌టాప్‌లకు అనుకూలమైన ఇంట్యూయిటివ్ ఇంటర్‌ఫేజ్‌తో వస్తుంది. ఇక నుంచి అతిథులు స్టే ఆప్షన్లను పరిశీలించవచ్చు, నవీకరించిన ఫోటోలు చూడవచ్చు, రియల్-టైమ్‌లో అందుబాటును తనిఖీ చేయవచ్చు, కొన్ని నిమిషాలలో బుకింగ్‌ను ధృవీకరించవచ్చు.
అలాగే అంతర్జాతీయ పర్యాటకుల కోసం బహు-కరెన్సీ మద్దతు, దేశీయ, అంతర్జాతీయ అతిథుల కోసం పారదర్శక ధరలు, భవిష్యత్ బుకింగ్స్ కోసం రిడీమబుల్ రివార్డ్ పాయింట్లు, కొనుగోలు లేదా గిఫ్టింగ్ కోసం గిఫ్ట్ కార్డులు, నిజమైన అతిథి సమీక్షలు, పూర్తి భద్రత కోసం సంకేతపరచబడిన, సురక్షిత చెల్లింపులు, అంతర్జాతీయ యాక్సెస్ కోసం బహుభాషా మద్దతు, ప్రాపర్టీ ఓనర్స్ కోసం లిస్టింగ్ ఆప్షన్స్, స్థానిక పర్యాటక వృద్ధికి మద్దతుగా ఉండాలని కోరుకున్నామని మిస్టర్ అర్షద్ జమాల్, ఈడెన్ హోమ్ స్టే ప్రతినిధి అన్నారు.