27 February, 2026 | 7:52 PM

గడ్డం మరియమ్మ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్

27-02-2026 06:05 PM

చొప్పదండి,(విజయక్రాంతి): చొప్పదండి నియోజకవర్గం మాజీ శాసన సభ్యులు సుంకె రవిశంకర్ అత్తమ్మ గడ్డం మరియమ్మ ఇటీవల పరమపదించగా, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ శుక్రవారం గంగాధర మండల కేంద్రంలోని వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, ప్రగాఢ సానుభూతి, సంతాపాన్ని వ్యక్తం చేశారు. గడ్డం మరియమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.