calender_icon.png 3 June, 2025 | 6:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

5 రోజుల పాటు వర్షాలు

02-06-2025 02:48:07 AM

తగ్గనున్న ఉష్ణోగ్రతలు

హైదరాబాద్, జూన్ 1 (విజయక్రాంతి): రాష్ట్రంలో రాగల ౫రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఫలితంగా రాష్ట్రం లో ఉష్ణోగ్రతలు భారీగా తగ్గనున్నాయి. సోమ వారం కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్త గూడెం, ఖ మ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వర్షా లు కురుస్తాయని పేర్కొంది. పలు జిల్లాల్లో 30 నుంచి 40 కిలోమీటర్ల వరకు ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. ఆదివారం మహబూబ్‌నగర్‌లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 32.5డిగ్రీ లు, వరంగల్ మెదక్ డిగ్రీలుగా నమోదయ్యాయి.